Hyderabad : హైదరాబాద్ లో మరో రెండు గంటల్లో కుండపోత ... హై అలెర్ట్

హైదరాబాద్ లో మరో రెండు గంటల్లో భారీ వర్షం పడుతుందని వాతావరణ శాఖ హెచ్చరించింది.

Update: 2025-09-26 05:50 GMT

హైదరాబాద్ లో మరో రెండు గంటల్లో భారీ వర్షం పడుతుందని వాతావరణ శాఖ హెచ్చరించింది. వాయుగుండం ప్రభావంతో రాత్రంతా కురిసిన భారీ వర్షాల నేపథ్యంలో సైబరాబాద్‌ ట్రాఫిక్‌ పోలీసులు శుక్రవారం ఉదయం ప్రజలను హెచ్చరించారు. వర్షాలు శనివారం మొత్తం కొనసాగే అవకాశముందని, వాతావరణ శాఖ ఆరెంజ్ హెచ్చరికలు జారీ చేసినట్టు తెలిపారు. సంస్థలు ఉద్యోగుల భద్రతను దృష్టిలో ఉంచుకొని వీలైనంత వరకు వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ విధానం అమలు చేయాలని ట్రాఫిక్‌ పోలీసులు సూచించారు. దీంతో ట్రాఫిక్‌ రద్దీ తగ్గడమే కాకుండా అత్యవసర సేవలు సాఫీగా సాగుతాయని తెలిపారు.

బయటకు వస్తే జాగ్రత్తలు పాటించాలంటూ...
సమయాన్ని సక్రమంగా ప్లాన్‌ చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ట్రాఫిక్‌ కంట్రోల్‌ రూమ్‌ పరిస్థితిని నిశితంగా గమనిస్తోందని, డీఆర్‌ఎఫ్‌ బృందాలు సిద్ధంగా ఉన్నాయని అధికారులు చెప్పారు. నీటిమునిగిన రహదారులు, నత్తనడక ట్రాఫిక్‌ సమస్యలు తలెత్తే అవకాశాలున్నందున ప్రయాణికులు ముందుగానే తమ ప్రణాళికను సక్రమంగా సిద్ధం చేసుకోవాలని సూచించారు. తాజా వాతావరణ అప్‌డేట్స్‌ను పౌరులు, సంస్థలు గమనిస్తూ జాగ్రత్తలు పాటించాలని పోలీసులు విజ్ఞప్తి చేశారు. వీలయినంత వరకూ బయటకు రాకపోవడమే మంచిదని సూచించారు


Tags:    

Similar News