Hyderabad : హైదరాబాద్ వాసులకు బిగ్ అలెర్ట్.... బయటకు రావద్దంటూ?
హైదరాబాద్ వాసులకు బిగ్ అలెర్ట్ ను వాతావరణ శాఖ జారీ చేసింది
హైదరాబాద్ వాసులకు బిగ్ అలెర్ట్ ను వాతావరణ శాఖ జారీ చేసింది. కొద్ది సమయంలో భారీ వర్షం కురుస్తుందని తెలిపింది. ద్రోణితో పాటు ఉపరితల ఆవర్తనం కారణంగా తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. సాయంత్రం నుంచి హైదరాబాద్ లో కొన్ని చోట్ల భారీ వర్షం పడుతుంది. ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం పడుతుందని వాతవావరణ శాఖ హెచ్చరించింది. రెయిన్ అలెర్ట్ జారీ చేసింది. వీలయినంత వరకూ ఎవరూ బయటకు రాకుండా ఉండటమే మంచిదని సూచించింది. మధ్యాహ్నం నుంచి వాతావరణం హైదరాబాద్ లో ఒక్కసారిగా మారిపోయింది.
భారీ వర్షంతో...
చల్లటి గాలులతో పాటు ఉరుములు, మెరుపులు కూడా వస్తున్నాయి. కొన్ని చోట్ల ఇప్పటికే వర్షం మొదలయింది. అిడ్స్, అంబర్ పేట్, రామంతపూర్, కోఠి, దిల్ సుఖ్ నగర్, సరూర్ నగర్, ఎల్బీనగర్, మలక్ పేట్, చార్మినార్, నాంపల్లి ప్రాంతంలో భారీ వర్షం కురిసింది. ఖైరతాబాద్, లక్డీకాపూల్, రాజ్ భవన్, ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాల్లో కూడా వర్షం మొదలయింది. ఈరోజు రాత్రికి భారీ వర్షం పడుతుందని వాతావరణ శాఖ చెప్పింది. ఆఫీసులకు వెళ్లిన వారు వీలయినంత వరకూ త్వరగా ఇంటికి చేరుకోవాలని సూచించారు. చిరు వ్యాపారులుకూడా వెంటనే తమ దుకాణాలను కట్టివేసి ఇంటికి చేరుకోవాలని కోరారు.
సీఎం సమీక్ష...
భారీ వర్షంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఉన్నతాధికారులతో సమీక్షించారు. ఈ రాత్రికి భారీ వర్షం పడే అవకాశమున్నందున ప్రజలను అప్రమత్తం చేయాలని సూచించారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని కోరారు. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ అధికారులు, రెవెన్యూ, విద్యుత్తు, పోలీసులు అందరూ సమన్వయంతో ముందుకు సాగాలని కోరారు. రహదారులపై నీరు నిల్వకుండా ఉండేలా చర్యలు తీసుకోవాలని, ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా తగిన ముందస్తు చర్యలు తీసుకోవాలని అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు.