Chiranjeevi : డీప్ ఫేక్పై మెగాస్టార్ చిరంజీవి ఏమన్నారంటే?

డీప్ ఫేక్పై మెగాస్టార్ చిరంజీవి స్పందించారు

Update: 2025-10-31 04:31 GMT

డీప్ ఫేక్పై మెగాస్టార్ చిరంజీవి స్పందించారు. హైదరాబాద్ లో జరిగిన ఎక్ తా దినోత్సవంలో పాల్గొన్న చిరంజీవి అక్కడ మీడియాతో మాట్లాడారు. డీజీపీ, సీపీ సజ్జనార్లు ఈ విషయాన్ని సీరియస్గా తీసుకున్నారని తెలిపారు. ఈ కేసును సీపీ సజ్జనార్ స్వయంగా పర్యవేక్షిస్తున్నారని మెగాస్టార్ చిరంజీవి తెలిపారు పోలీస్ వ్యవస్థ చాలా బలంగా ఉందన్నారు చిరంజీవి.

మంచి కోసం వినియోగించాలంటే...
మంచికోసం వినియోగించాల్సిన వాటిని చెడుకోసం వినియోగిస్తున్నారని మెగాస్టార్ చిరంజీవి తెలిపారు. ఏదైనా ఒక సాంకేతిక అంశం వస్తే దానిని మంచికే వినియోగించుకోవడాన్ని నేటి యువత నేర్చుకోవాలని మెగాస్టార్ చిరంజీవి అన్నారు. ఇటీవల తనపై సామాజిక మాధ్యమాల్లో వచ్చిన వీడియోలపై చిరంజీవి పోలీసులకు ఫిర్యాదు చేశారు.


Tags:    

Similar News