Hyderabad : శంషాబాద్ ఎయిర్ పోర్టులో ప్రయాణికుల ఆందోళన

శంషాబాద్ ఎయిర్ పోర్టులో అనేక విమానాలు ఇంకా బయలుదేరలేదు

Update: 2025-11-08 03:56 GMT

శంషాబాద్ ఎయిర్ పోర్టులో అనేక విమానాలు ఇంకా బయలుదేరలేదు. సాంకేతిక కారణాలతో అనేక విమానాలు ఎయిర్ పోర్టులోనే నిలిచిపోయాయి. పలు విమానాలు నిలిచిపోవడంతో రాత్రి నుంచి ప్రయాణికులు శంషాబాద్ ఎయిర్ పోర్టులోనే వేచి ఉన్నారు. వియత్నాం వెళ్లాల్సిన ప్రయాణికులు రాత్రి నుంచి ఎయిర్ పోర్టులో ఉన్నారు. విమానం ఎప్పుడు బయలుదేరుతుందన్న సమాచారం తెలియక ఆందోళనకు దిగారు.

విమానాలు బయలుదేరకపోవడంతో...
మరొకవైపు దేశీయ విమానాలు కూడా అనేకం నిలిచిపోయాయి. గోవాతో పాటు దేశంలోని పలు ప్రాంతాలకు వెళ్లాల్సిన విమానాలు శంషాబాద్ ఎయిర్ పోర్టులోనే ఉన్నాయి. ఇందులో ఇండిగో, ఎయిర్ ఇండియా విమాన సర్వీసులు ఎక్కువగా ఉన్నాయని ప్రయాణికులు చెబుతున్నారు. అయితే సాంకేతిక కారణంతోనే విమానాలు వెళ్లడంలో ఆలస్యమవుతుందని చెబుతున్నారు.


Tags:    

Similar News