విమానాల రద్దు... ఎందుకంటే?

శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో పలు విమానాల రద్దయ్యాయి. దీంతో ప్రయాణీకుల ఆందోళన చెందుతున్నారు.

Update: 2023-04-10 03:01 GMT

శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో పలు విమానాల రద్దయ్యాయి. దీంతో ప్రయాణీకుల ఆందోళన చెందుతున్నారు. హైదరాబాద్ నుండి పలు ప్రాంతాలకు వెళ్లాల్సిన, రావాల్సిన ఎయిర్ ఇండియా ఎయిర్ లైన్స్ విమానాలు రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. విమానాలు ఎందుకు రద్దు చేస్తున్నట్లో ప్రకటించలేదు.

ప్రయాణికుల ఆందోళన...
దీంతో ప్రయాణికులు శంషాబాద్ ఎయిర్‌పోర్టులో ఆందోళనకు దిగారు. సోమవారం కావడంతో విధులకు వెళ్లాల్సిన ఉద్యోగులు కూడా ఇబ్బంది పడుతున్నారు. దీంతో ఎయిర్‌పోర్టు సిబ్బంది కూడా సమాధానం చెప్పుకోలేక తప్పుకుంటున్నారు. దీనిపై ప్రయాణికులు నిరసన వ్యక్తం చేస్తున్నారు.


Tags:    

Similar News