Hyderabad : మంచినీటి సరఫరాకు అంతరాయం
హైదరాబాద్ లో మంచి నీటి సరఫరాకు అంతరాయం కలగడానికి అనేక కారణాలున్నాయి
హైదరాబాద్ లో మంచి నీటి సరఫరాకు అంతరాయం కలగడానికి అనేక కారణాలున్నాయి. అందులో రహదారి పనులు చేపట్టడం వల్ల కూడా మంచినీటి సరఫరా నిలిచిపోతుంది. తాజాగా నార్సింగి ప్రధాన రోడ్డుపై జంక్షన్ పనులు జరుగుతుండటంతో మణికొండ–నార్సింగిలో నీటి సరఫరాకు అంతరాయం ఏర్పడింది. మణికొండ పరిధిలోని నర్సింగి ప్రధాన రోడ్డుపై కొనసాగుతున్న జంక్షన్ పనుల కారణంగా మణికొండ, నార్సింగి ప్రాంతాల్లోని కొన్ని కాలనీలకు నీటి సరఫరాలో అంతరాయం ఏర్పడింది.
రోడ్డు జంక్షన్ లో పనులు జరుగుతుండటంతో...
పని ప్రదేశంలో ఎలాంటి భద్రతా చర్యలు లేకపోవడం గమనించిన ఆయన, తక్షణమే బ్యారికేడ్లు ఏర్పాటు చేయాలని కాంట్రాక్టర్‌ను ఆదేశించారు. నిర్ణీత గడువులో పనులు పూర్తిచేయాలని కూడా హెచ్చరించారు. లాన్సమ్ ఎల్డోరాడో నివాసితులు కొత్త నీటి కనెక్షన్ కోసం దరఖాస్తు చేయడంతో ఈ జంక్షన్ పనులు ప్రారంభించినట్లు అధికారులు తెలిపారు. టీఎన్‌జీవో కాలనీ ప్రాంతంలో నిర్మాణంలో ఉన్న కొత్త రిజర్వాయర్లు, ఎస్‌టీపీల పనులను హెచ్‌ఎండబ్ల్యూఎస్‌ఎస్‌బీ మేనేజింగ్ డైరెక్టర్ అశోక్‌రెడ్డి పరిశీలించారు. రాబోయే రెండేళ్లలో కాలనీలో నిర్మించే రిజర్వాయర్ల ద్వారా పంపింగ్ అవసరం లేకుండా నీటిని సరఫరా చేయగలమని అంచనా వేస్తున్నట్లు అధికారులు తెలిపారు.