Manchu Manoj : మా నాన్న దేవుడు.. మంచు మనోజ్ సంచలన కామెంట్స్
తనపై అసత్యప్రచారం చేస్తున్నారని మంచు మనోజ్ తెలిపారు
తనపై అసత్యప్రచారం చేస్తున్నారని మంచు మనోజ్ తెలిపారు. ఆయన జల్పల్లిలో తన నివాసంలో మీడియాతో మాట్లాడుతూ తాను ఎవరినీ ఆస్తులను అడగలేదన్నారు. అయితే మీడియాపై దాడి చేయడం బాధ కలిగించిందన్నారు. తాను క్షమాపణ చెబుతానని తెలిపారు. తనభార్య, ఏడు నెలల కూతురిని బయటకు లాగుతున్నారన్నారు. తాను సొంత కాళ్ల మీద నిలబడటానికి ప్రయత్నిస్తున్నానని తెలిపార. తనకు మా నాన్న దేవుడని, కానీ ఈరోజు కనిపిస్తున్న తన తండ్రి కాదని మంచు మనోజ్ తెలిపారు.
విజయ్ అనే వ్యక్తి...
విజయ్ అనే వ్యక్తి తనపై దాడి చేశారన్నారు.ఈ విషయం తాను డీజీపికి కూడా ఫిర్యాదు చేశానని అన్నారు. తాను ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకున్నానని మంచు మనోజ్ తెలిపారు. తాను రూపాయి తీసుకోకుండా సినిమాలకు పనిచేశానని చెప్పారు. తాను దొంగతనం చేసి వేరే వాళ్ల కడుపులను కొట్టి బతుకుదామని తనకు లేదన్నారు. తన భార్యపై అవనసర నిందలు మోపుతున్నారన్నారు. మా నాన్న భుజంపై తుపాకీ పెట్టి కాలుస్తున్నారన్నారని మంచు మనోజ్ తెలిపారు. ఆస్తుల కోసం కాదని, మంచి కోసమే నిలబెడతానని, సాయంత్రం అన్నివిషయాలను మీడియాకు చెబుతానని తెలిపారు. తాను రాచకొండ కమిషనర్ ఎదుట విచారణకు హాజరవ్వడానికి వెళుతున్నానని తెలిపారు. మీడియాతో మాట్లాడుతూ ఆయన భావోద్వేగానికి గురయ్యారు.