ఇతగాడిని పట్టుకోకుంటే హైదరాబాద్ లో ఎంత విధ్వంసం జరిగేదో కదా? ఎంత ప్లాన్ వేశాడు?
హైదరాబాద్ లో భారీ పేలుళ్లకు కుట్రపన్నిన సిరాజ్ తో పాటు సయ్యద్ సమీర్ ను పట్టుకోవడంతో పెద్ద ముప్పు తప్పినట్లయింది
sameer and siraj
హైదరాబాద్ లో భారీ పేలుళ్లకు కుట్రపన్నిన సిరాజ్ తో పాటు సయ్యద్ సమీర్ ను పట్టుకోవడంతో పెద్ద ముప్పు తప్పినట్లయింది. లేకుంటే హైదరాబాద్ లో జనసమ్మర్థం ఉన్న ప్రాంతాల్లో భారీ పేలుళ్లు జరిపి అమాయకులను చంపాలని చూశారు. ఇద్దరు నిందితుల కుట్రలను పోలీసులు ముందుగానే తెలుసుకుని భగ్నం చేయడంతో పెద్ద ముప్పు తప్పింది. లేకుంటే ఎన్ని ప్రాణాలు పోయేవో? అన్న ఆందోళన వ్యక్తమవుతుంది. విజయనగరానికి చెందిన సిరాజ్ హైదరాబాద్ కు వచ్చి రెండుసార్లు ఎస్ఐ పరీక్ష రాసి ఫెయిలయ్యాడు. ఈ సందర్భంగా సిరాజ్ కు సమీర్ పరిచయమయ్యాడు. దీంతో ఒక మతాన్ని కావాలనిఅణిచివేస్తున్నారని భావించిన సిరాజ్ మత పెద్దల ప్రసంగాలు విని మరింతగా కలవరానికి గురయ్యాడు.
పరిచయాలు పెంచుకుని...
హైదరాబాద్ కు చెందిన సిరాజ్ తో పాటు కర్ణాటక, మహారాష్ట్రకు చెందిన వారు నలుగురు పరిచయం కావడంతో ఒక వర్గానికి అన్యాయం జరుగుతుందని, తాము ఏదో ఒకటి చేయాలని భావించి సిరాజ్ పేలుళ్లకకు కుట్ర పన్నాడు. సోషల్ మీడియాలో పేలుళ్లు ఎలా జరపాలో తెలుసుకున్నాడు. టిఫిన్ బాక్సుల్లో పేలుళ్లయితే ఎవరికీ అనుమానం రాదని భావించి అమెజాన్ నుంచి టిఫిన్ బాక్స్ లు తెప్పించుకున్నాడు. ఇక పేలుడు పదార్థాలను కొనుగోలు చేయడానికి హైదరాబాద్ సరైన ప్లేస్ కాదని భావించి విజయనగరాన్ని ఎంచుకున్నాడు. ముంబయి ఢిల్లీ, హైదరాబాద్ లో కొందరితో పరిచయాలు పెంచుకుని పేలుళ్లకు కుట్ర పన్నాడు. ఇందుకోసం సిరాజ్ ప్రత్యేక బృందాన్ని ఏర్పటు చేసుకున్నాడు.
వాట్సాప్ గ్రూపు ను...
సోషల్ మీడియాలో వాట్సాప్ గ్రూపు ను ఏర్పాటు చేసుకున్నాడు. మూడో వాడికి తాము మాట్లాడుకున్నది తెలియకుండా వాట్సాప్ కాల్ ద్వారానే మాట్లాడుకునే వారు. విజయనగరంలోనే పేలుడు పదార్థాలను కొనుగోలు చేసినట్లు పోలీసులు గుర్తించారు. సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకోవడం ద్వారా మరిన్ని విషయాలను తెలుసుకున్న పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. సిరాజ్ తండ్రి పోలీసు శాఖలో పనిచేస్తున్నాడు. అయితే ఒకవర్గానికి చెందిన పుస్తకాలు చదివిన సిరాజ్ దానిపట్ల ఆకర్షితుడై పేలుళ్లు జరపడానికి పెద్ద ప్లాన్ వేశాడు. అయితే గత ఏడాది ముంబయి వెళ్లి పది మందిని కలసిన సిరాజ్ తర్వాత పేలుళ్లు జరపాలని భావించారు. ఈ ప్రయత్నంలోనే పోలీసులు వలపన్ని పట్టుకున్నారు. దీంతో సిరాజ్, సమీర్ కుట్ర భగ్నం అయింది. ఇద్దరికీ విజయనగరం కోర్టు పథ్నాలుగు రోజులు రిమాండ్ విధించింది.