నార్సింగిలో భారీ అగ్నిప్రమాదం
నార్సింగిలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఒక భవనంలో మంటలు అంటుకున్నాయి
నార్సింగిలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఒక భవనంలో మంటలు అంటుకున్నాయి. గ్రౌండ్ ఫ్లోర్ లో ప్రారంభమయిన మంటలు పైకి వ్యాపిస్తున్నాయి.అయితే భవనంలో నలుగురు చిన్నారులు చిక్కుకున్నారు. వారిలో ఇద్దరు చిన్నారులు మంటల ధాటికి భయపడి కిందకు దూకినట్లు తెలిసింది. వారికి గాయలు కావడంతో ఆసుపత్రికి తరలించారు.
మంటల్లో చిక్కుకున్న చిన్నారులు..
మంటల్లో చిక్కుకున్న చిన్నారులను బయటకు తెచ్చేందుకు స్థానికులు ప్రయత్నం చేశారు. అగ్నిప్రమాదం సమాచారం వెంటనే స్థానికులు అగ్నిమాపక శాఖ కు సమాచారం అందించారు. అగ్నిమాపక సిబ్బంది వచ్చి మంటలను ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు.రెండతస్తుల భవనంలో జరిగిన ఈ అగ్నిప్రమాదానికి కారణాలు మాత్రం ఇంకా తెలియాల్సి ఉంది.