BRS : నేడు బీఆర్ఎస్ లో చేరికలు
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపై ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ సీరియస్ ఫోకస్ పెట్టింది
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపై ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ సీరియస్ ఫోకస్ పెట్టింది. జూబ్లీహిల్స్ లోని ఇతర పార్టీలకు చెందిన ద్వితీయ శ్రేణి నాయకులకు బీఆర్ఎస్ గాలం వేసింది. స్వయంగా నేతలతో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాట్లాడుతున్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు సంబంధించి ఇప్పటికే అభ్యర్థిగా మాగటి సునీతను పార్టీ ఖరారు చేసింది.
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో...
దీంతో ఈ ఎన్నికల్లో గెలిచేందుకు అవసరమైన వ్యూహాలను కేటీఆర్ దగ్గరుండి రూపొందిస్తున్నారు. అందులో భాగంగా ఇతర పార్టీల నుంచి వచ్చే ప్రతి నేతతో ఆయన మాట్లాడుతూ పార్టీలో చేరితే అవకాశాలుంటాయని హామీ ఇస్తున్నారు. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో గెలిచేందుకు కేటీఆర్ కసరత్తులు ఎప్పుడో ప్రారంభించారు. అందులో భాగంగా తెలంగాణ భవన్ లో ఈరోజు 11:30గంలకు కేటీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ లోకి పలువురు నాయకులు చేరనున్నారు.