Jublee Hills By Election : నేడు మాగంటి సునీత నామినేషన్
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు సంబంధించి నేడు బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత నామినేషన్ వేయనున్నారు
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు సంబంధించి నేడు బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత నామినేషన్ వేయనున్నారు. నిన్ననే పార్టీ అధినేత కేసీఆర్ నుంచి బీఫారం అందుకున్న మాగంటి సునీత ఈరోజు తన మొదటి సెట్ నామినేషన్ ను దాఖలు చేస్తారని పార్టీ వర్గాలు తెలిపాయి. సిట్టింగ్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాధ్ ఆకస్మిక మరణంతో జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఉప ఎన్నిక అనివార్యమయింది.
రెండో సెట్ ను...
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో తమ అభ్యర్థిగా ముందుగానే ప్రకటించిన బీఆర్ఎస్ ప్రచారాన్ని కూడా ప్రారంభించింది. మాగంటి సునీత నేడు మొదటి సెట్ నామినేషన్ ను దాఖలు చేస్తారు. అనంతరం రెండో సెట్ నామినేషన్ ను ఈ నెల 19వ తేదీన దాఖలు చేస్తారని పార్టీ వర్గాలు తెలిపాయి. వచ్చే నెల 11వతేదీన జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక పోలింగ్ జరగనుంది.