మాగంటి గోపీనాధ్ తల్లి సంచలన ఆరోపణలు
జూబ్లీహిల్స్ నియోజకవర్గం దివంగత ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ తల్లి ఆరోపణలు సంచలనం కలిగిస్తున్నాయి
జూబ్లీహిల్స్ నియోజకవర్గం దివంగత ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ తల్లి ఆరోపణలు సంచలనం కలిగిస్తున్నాయి. కేటీఆర్ టార్గెట్ గా గోపినాథ్ తల్లి ఆరోపణలు చేశారు. చివరి క్షణాల్లో కన్నకొడుకును చూడనీయకుండా చేశాడని ఆవేదన వ్యక్తం చేశారు. జూబ్లీహిల్స్ ఎన్నికలవేళ ఆమె వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. అయితే ఇవన్నీ తప్పుడు ఆరోపణలంటూ బీఆర్ఎస్ నేతలు కొట్టిపారేస్తున్నారు.
ఖండించిన బీఆర్ఎస్...
ఆరునెలల తర్వాత కావాలనే రాజకీయం చేస్తున్నారంటూ బీఆర్ఎస్ నేతలు చెబుతున్నారు. పోలింగ్ కు నాలుగైదు రోజులముందు కుట్రలు చేస్తున్నారని.. ఓటమి భయంతోనే అధికార పార్టీ నేతలు దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారంటూ బీఆర్ఎస్ విమర్శలు చేస్తుంది. పోలింగ్ ముందర ఇదేం చికాకు అంటూ గులాబీ పార్టీ స్థానిక ముఖ్య నాయకులు కలవరపాటుకు గురవుతున్నారు.