హైదరాబాద్ నగరంలో చిరుత పులి

హైదరాబాద్ నగరంలో చిరుత పులి సంచారం భయాందోళనలకు గురి చేస్తుంది

Update: 2025-07-28 12:48 GMT

హైదరాబాద్ నగరంలో చిరుత పులి సంచారం భయాందోళనలకు గురి చేస్తుంది. గోల్కొండ సమీపంలోని ఇబ్రహీం బాగ్ మిలటరీ ప్రాంతంలో ఒక చిరుతపులి రోడ్డును దాటుతున్న దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. నాలుగు రోజుల క్రితం గండిపేట చెరువు సమీపంలోని మంచిరేవుల వద్ద కనిపించిన చిరుతపులి ఇది ఒక్కటేనని భావిస్తున్నారు.

గోల్కొండ ప్రాంతంలో...
తారామతి వెనకవైపు ఉన్న మూసీ నది దిశగా చిరుతపులి వెళ్లినట్లు గుర్తించిన అధికారులు దానికోసం వెదుకుతున్నారు. గోల్కొండ పోలీసులతో పాటు అటవీ శాఖ అధికారులు కూడా ఈ ప్రాంతంలో చిరుతపులి కోసం గాలిస్తున్నారు. ఈ ప్రాంతంలో ట్రాప్ కెమెరాలను ఏర్పాటు చేశారు. నాలుగు బోన్లను కూడా ఉంచారు. ఈ ప్రాంతంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అటవీ శాఖ అధికారులు కోరుతున్నారు.


Tags:    

Similar News