BRS : బీఆర్ఎస్ అభ్యర్థిగా మాగంటి సునీత

జూబ్లీహిల్స్ బీఆర్ఎస్ అభ్యర్థిగా మాగంటి గోపీనాధ్ సతీమణి సునీత పేరును నాయకత్వం ఖరారు చేసింది

Update: 2025-09-26 07:18 GMT

జూబ్లీహిల్స్ బీఆర్ఎస్ అభ్యర్థిగా మాగంటి గోపీనాధ్ సతీమణి సునీత పేరును నాయకత్వం ఖరారు చేసింది. మాగంటి గోపీనాధ్ మృతితో జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలు జరగనున్నాయి. త్వరలో నోటిఫికేషన్ కూడా వెలువడుతుంది. ఈనేపథ్యంలో గత కొద్ది రోజులుగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నగరంలోని పార్టీకి చెందిన ముఖ్య నేతలతో సమావేశమయి చర్చించారు.

కేసీఆర్ ఆదేశాలతో...
బీఆర్ఎస్ ముఖ్యనేతలందరి అభిప్రాయాలను పార్టీ అధినేత కేసీఆర్ ముందుంచారు. దీంతో జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలో బీఆర్ఎస్ అభ్యర్థిగా మాగంటి సునీత అభ్యర్థిత్వానికి కేసీఆర్ ఆమోదం తెలిపారు. మాగంటి సునీతను ఇక ప్రచారం చేసుకోవాలని కేసీఆర్ ఆదేశించారు. దీంతో జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలో మాగంటి సునీతను అభ్యర్థిగా ప్రకటించి ప్రచారానికి బీఆర్ఎస్ శ్రీకారం చుట్టనుంది.


Tags:    

Similar News