Hyderabad : లష్కర్ బోనాలు ప్రారంభం.. మహంకాళీ అమ్మవారికి మొక్కులు

నేడు లష్కర్ బోనాలు ప్రారంభమయ్యాయి. సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి ఆలయం వద్ద భక్తులు బారులు తీరారు

Update: 2025-07-13 02:20 GMT

తెలంగాణలో ఆషాడమాసం బోనాలు జరుగుతున్నాయి. ఇప్పటికే ప్రారంభమయిన బోనాలు ఈరోజు ఉజ్జయిని బోనాలు జరుగుతుంది. లష్కర్ బోనాలుగా కూడా దీనిని పిలుస్తారు. ఈరోజు ఉదయం నుంచి భక్తులు ఉజ్జయిని మహంకాళి అమ్మవారికి బోనం సమర్పించుకునేందుకు బారులు తీరారు. హైదరాబాద్ లో నేడు మహంకాళి జాతర ప్రారంభం కావడంతో అనేక ట్రాఫిక్ ఆంక్షలను విధించారు. ఉజ్జయిని మహంకాళి అమ్మవారికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేడు బోనం సమర్పించనున్నారు.

ఉదయం నుంచే ఆలయానికి...
అనంతరం ఆలయం వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. భక్తులు ఉదయం నుంచి బోనాలతో మహిళలు పెద్ద సంఖ్యలో తరలి వచ్చారు. డప్పుచప్పులు, పోతురాజుల వీరంగాలు, ఘటాల ఊరేగింపుతో మహంకాళి జాతర ఉదయమే ప్రారంభమయింది. దీంతో పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. దాదాపు 2,500 మంది పోలీసులను భధ్రత కోసం నియమించారు. హైదరాబాద్, సికింద్రాబాద్ నగరంలో పలు చోట్ల ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. మద్యం దుకాణాలు బంద్ అయ్యాయి. రేపు ఉదయం వరకూ జాతర కొనసాగుతుంది. రేపు భవిష్య వాణి వినిపించనున్నారు.


Tags:    

Similar News