Bus Accident : ఈ బస్సు ఒడిశాలో రిజిస్ట్రేషన్ చేసి
కర్నూలు జిల్లాలో ప్రమాదానికి గురైన వేమూరి కావేరి బస్సు ఒడిశా రాష్ట్రంలోని రాయగడ జిల్లాలో రిజిస్ట్రేషన్ అయిందని తెలంగాణ రవాణా శాఖ స్పష్టం చేసింది
కర్నూలు జిల్లాలో ప్రమాదానికి గురైన వేమూరి కావేరి బస్సు ఒడిశా రాష్ట్రంలోని రాయగడ జిల్లాలో రిజిస్ట్రేషన్ అయిందని తెలంగాణ రవాణా శాఖ స్పష్టం చేసింది. ఆ బస్సుపై తెలంగాణలో పలుమార్లు ఓవర్‌స్పీడింగ్ కేసులు నమోదయ్యాయని తెలిపింది. అయితే బస్సుకు సంబంధించిన అన్ని వివరాలు ఒడిశా రవాణా శాఖ అధికారులు పరిశీలిస్తారని చెప్పారు.
రవాణా శాఖ అధికారులతో...
బస్సు ఫిట్‌నెస్, అనుమతి పత్రాలు ఒడిశా అధికారుల పరిధిలో ఉన్నాయని ట్రాన్స్‌పోర్ట్ శాఖ అధికారులు తెలిపారు. ప్రమాదానికి సంబంధించి అన్ని వివరాలను రెండు రాష్ట్రాల అధికారులు సమన్వయంతో పరిశీలిస్తున్నట్లు చెప్పారు. బస్సు ప్రమాదానికి గల కారణాలను, అందుకు అవసరమైన అనుమతులను కూడా పరిశీలిస్తామని తెలిపారు.