KTR : నేడు సిట్ విచారణకు కేటీఆర్

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నేడు ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ విచారణకు హాజరు కానున్నారు

Update: 2026-01-23 02:19 GMT

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నేడు ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ విచారణకు హాజరు కానున్నారు. ఉదయం పదకొండు గంటలకు విచారణకు రావాలని సిట్ అధికారులు ఇచ్చిన నోటీసుల్లో పేర్కొన్నారు. జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ లో కేటీఆర్ విచారణ జరగనుంది. ఫోన్ ట్యాపింగ్ కేసులో నేడు కేటీఆర్ ను విచారించనుండటంతో పెద్దయెత్తున బీఆర్ఎస్ శ్రేణులు హైదరాబాద్ కు తరలి రానున్నాయి.

ఫోన్ ట్యాపింగ్ కేసులో...
కేటీఆర్ ఉదయం 9 గంటలకు తెలంగాణ భవన్ కు చేరుకోనున్నారు. అనంతరం ఉదయం పది గంటలకు కేటీఆర్ మీడియా సమావేశంలో మాట్లాడతారు. ఆ తర్వాత సిట్ కార్యాలయానికి బయలుదేరి కేటీఆర్ చేరుకుంటారు. ఈ సందర్భంగా జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ ప్రాంతంలో భారీగా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎవరికీ ఈ ప్రాంతంలోకి అనుమతి లేదని చెప్పారు. బ్యారికేడ్లను నిర్మించారు.


Tags:    

Similar News