Justice Sudarsan Reddy : రాజ్యాంగం కోసమే పోటీ చేస్తున్నా : జస్టిస్ సుదర్శన్ రెడ్డి
యాభై ఏళ్లుగా న్యాయవ్యవస్థలో కొనసాగుతున్న తాను రాజకీయాల్లోకి రావడానికి కారణాలను ఇండి కూటమి ఉప రాష్ట్రపతి అభ్యర్థి జస్టిస్ సుదర్శన్ రెడ్డి అన్నారు.
యాభై ఏళ్లుగా న్యాయవ్యవస్థలో కొనసాగుతున్న తాను రాజకీయాల్లోకి రావడానికి కారణాలను ఇండి కూటమి ఉప రాష్ట్రపతి అభ్యర్థి జస్టిస్ సుదర్శన్ రెడ్డి అన్నారు. తెలంగాణలోని కాంగ్రెస్ ఎంపీలు, రాజ్యసభ సభ్యులు, మంత్రులు, ఎమ్మెల్యేలు, సీపీఐ నేతలు, రాజకీయ ప్రతినిధులతో ఆయన సమావేశమయి మాట్లాడారు. రాజ్యాంగాన్ని కాపాడటం కోసమే తాను ఈ ఎన్నికలో పోటీ చేస్తున్నానని తెలిపారు. రాజకీయ ముళ్ల కిరీటం నెత్తిన పెట్టుకున్నానని అనేక మంది తనను ప్రశ్నించారని, కానీ తాను ఈపదవిలో ఉండి రాజ్యాంగాన్ని కాపాడటం కోసమేనని జస్టిస్ సుదర్శన్ రెడ్డి తెలిపారు.
సుప్రీంకోర్టు కేసులను...
ఈ దేశంలో ఒక పౌరుడిగా తాను ఈ ఎన్నికల్లో పోటీ చేస్తున్నానని, పౌర హక్కుల గురించి, సామాజిక న్యాయం గురించి, రాజ్యాంగంలో పొందుపర్చిన ఆదేశిక సూత్రాల గురించి మాట్లాడుతుంటానని జస్టిస్ సుదర్శన్ రెడ్డి అన్నారు. తాను ఏ పార్టీకి చెందిన వాడిని కాదని అన్నారు. ప్రాధమిక హక్కులు పరిరక్షించడం తన బాధ్యత అని అన్నారు. తన ప్రత్యర్థితో మాట్లడే అవకాశం తనకు ఇంత వరకూ దక్కలేదని అన్నారు. పోటీలో ఇద్దరు మాట్లాడుతుంటే ఎవరి అభిప్రాయాలు ఏంటో తెలుస్తాయని, కానీ తన ప్రత్యర్థి ఎక్కడ పర్యటిస్తున్నారో.. ఎక్కడ మాట్లాడుతున్నారో తనకు తెలియదని జస్టిస్ సుదర్శన్ రెడ్డి అన్నారు. ఇరువురి మధ్య చర్చ పెడితే ఎవరికి ఓటు వేయాలో నిర్ణయం తీసుకుంటారన్నారు. తనకు మద్దతివ్వాలనుకున్న వారు ఆత్మప్రభోధం మేరకు ఓటు వేయాలని, పార్టీలను చూడకుండా వ్యక్తులను చూసి ఓటు వేయాలని జస్టిస్ సుదర్శన్ రెడ్డి కోరారు. సుప్రీంకోర్టు తీర్పును తనకు వ్యక్తిగతంగా అంటగట్టడమేంటని జస్టిస్ సుదర్శన్ రెడ్డి ప్రశ్నించారు.