జూబ్లీహిల్స్ నియోజకవర్గం ఉప ఎన్నికల ఏర్పాట్లు షురూ

జూబ్లీహిల్స్ నియోజకవర్గం ఉప ఎన్నికల పోలింగ్ రేపు జరగనుంది.

Update: 2025-11-10 04:53 GMT

జూబ్లీహిల్స్ నియోజకవర్గం ఉప ఎన్నికల పోలింగ్ రేపు జరగనుంది. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను ఎన్నికల అధికారులు చేస్తున్నారు. కాసేపట్లో కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియంలో ఎన్నికలకు సంబంధించిన సామగ్రిని పంపిణీ చేయనున్నారు. రేపు ఉదయం నుంచి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల పోలింగ్ ప్రారంభం కానుండటంతో పోలీసులు కూడా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

యాభై ఎనిమిది మంది అభ్యర్థులు...
జూబ్లీహిల్స్ నియోజకవర్గం ఉప ఎన్నికల బరిలో మొత్తం 58 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. ప్రధానంగా బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ ల మధ్య పోటీ నెలకొంది. దాదాపు నాలుగు లక్షల మందికి పైగా ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. పోలింగ్ కేంద్రాల్లో అవసరమైన అన్ని ఏర్పాట్లను చేస్తున్నారు. రేపు ఉదయం నుంచి పోలింగ్ కేంద్రానికి ఓటర్లు రానుండటంతో పోలీసులు కూడా భారీగా మొహరించారు.


Tags:    

Similar News