జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో పోలింగ్ శాతం ఎంతంటే?

జూబ్లీహిల్స్ నియోజకవర్గం ఉప ఎన్నికల్లో ఉదయం పదకొండు గంటల వరకూ 21 శాత పోలింగ్ నమోదయింది.

Update: 2025-11-11 06:24 GMT

జూబ్లీహిల్స్ నియోజకవర్గం ఉప ఎన్నికల్లో ఉదయం పదకొండు గంటల వరకూ 21 శాత పోలింగ్ నమోదయింది. మధ్యాహ్నం నుంచి పోలింగ్ శాతం పెరిగే అవకాశముందని అధికారులు అంచనా వేస్తున్నారు. మధ్యాహ్నం భోజనం చేసిన తర్వాత పోలింగ్ కేంద్రాలకు ఓటర్లు తరలి వచ్చే అవకాశముందని భావిస్తున్నారు. ఇప్పటి వరకూ 21 శాతం పోలింగ్ నమోదయిందంటే ఈ రోజు అరవై శాతం పోలింగ్ అయ్యే అవకాశముందని అధికారులు చెబుతున్నారు.

చలి తీవ్రత ఎక్కువగా ఉండటంతో...
గత అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం 45 శాతం మాత్రమే పోలయిందని, ఈసారి అంతకంటే ఎక్కువగా పోలింగ్ జరుగుతుందని ఎన్నికల అధికారులు చెబుతున్నారు. కొన్ని పోలింగ్ కేంద్రాల వద్దకు ఇప్పుడిప్పుడే ఓటర్లు చేరుకుంటున్నారు. ఉదయం నుంచి చలి తీవ్రత ఎక్కువగా ఉండటంతో ఓటర్లకు రాలేదని, ఇప్పుడు వస్తుండటంతో పోలింగ్ శాతం పెరుగుతుందని భావిస్తున్నారు.


Tags:    

Similar News