Jublee Hills Bye Elections : నేటితో ముగియనున్న నామినేషన్ల గడువు
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు సంబంధించి నామినేషన్ల గడువు నేటితో ముగియనుంది
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు సంబంధించి నామినేషన్ల గడువు నేటితో ముగియనుంది. ఈరోజు భారీగా నామినేషన్లు దాఖలయ్యే అవకాశముంది. ఇప్పి వరకూ కాంగ్రెస, బీఆర్ఎస్ అభ్యర్థులు నామినేషన్లు వేశారు. కొందరు స్వతంత్ర అభ్యర్థులు కూడా నామినేషన్లు వేసిన వారిలో ఉన్నారు. ఈరోజు బీజేపీ అభ్యర్థి దీపక్ రెడ్డి తన నామినేషన్ పత్రాలను దాఖలు చేయనున్నారు.
అత్యధికమంది దాఖలు చేసేందుకు...
నేటితో నామినేషన్లు గడువు ముగియనుండటంతో ఎక్కువ మంది అభ్యర్థులు నామినేషన్లు వేసే అవకాశముంది. రేపు నామినేషన్లను పరిశీలిస్తారు. నామినేషన్ల పరిశీలనకు ఈ నెల 24వ తేదీ వరకూ గడువు ఉంది. వచ్చే నెల 11వ తేదీన జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక జరగనుంది. 14వ తేదీన కౌంటింగ్ జరగనుంది. ఈరోజు నామినేషన్లు ఎక్కువ దాఖలయ్యే అవకాశముండటంతో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.