Jubilee Hills Bye Election : జూబ్లీహిల్స్ .. రికార్డు స్థాయిలో నామినేషన్లు

జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో భారీగా నామినేషన్లు దాఖలయ్యాయి.

Update: 2025-10-22 01:42 GMT

జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో భారీగా నామినేషన్లు దాఖలయ్యాయి. ఈరోజు తెల్లవారు జామున వరకూ నామినేషన్లను అధికారులు స్వీకరించారు. మొత్తం 321 నామినేషన్లను అధికారులు స్వీకరించారు. నిన్న నామినేషన్లకు ఆఖరిరోజు కావడంతో అత్యధిక సంఖ్యలో దరఖాస్తులు వచ్చాయి. మధ్యాహ్నం మూడు గంటలకు క్యూ లైన్ లో ఉన్న వారందరి వద్ద నుంచి నామినేషన్లను అధికారులు స్వీకరించారు. నిన్న చివరి రోజున మొత్తం 194 నామినేషన్లు దాఖలయ్యాయి. అయితే నామినేషన్ల గడువు నిన్నటితో పూర్తి కావడంతో ప్రస్తుతం జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఉప ఎన్నికల్లో మొత్తం 211 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు.

నేడు పరిశీలన...
నేడు నామినేషన్లను అధికారులు పరిశీలించనున్నారు. నామినేషన్ల ఉపసంహరణకు తుది గడువు 24వ తేదీగా పేర్కొన్నారు. నవంబరు 11న పోలింగ్ జరగనుండగా, 14వ తేదీన కౌంటింగ్ జరగనుంది. దీంతో జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో రికార్డు స్థాయిలో నామినేషన్లు దాఖలయినట్లయింది. రీజనల్ రింగ్ రోడ్డు బాధితులతో పాటు మరికొందరు పెద్దయెత్తున నామినేషన్లు దరఖాస్తు చేసిన వారిలో ఉన్నారు.


Tags:    

Similar News