Jubilee Hills : జూబ్లీహిల్స్ ఎన్నికల్లో తిరస్కరించిన నామినేషన్ లు ఇవే
జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఉపఎన్నిక నామినేషన్ల పరిశీలన ప్రక్రియ పూర్తయింది.
జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఉపఎన్నిక నామినేషన్ల పరిశీలన ప్రక్రియ పూర్తయింది. మొత్తం 211 నామినేషన్లలో 81 మంది అభ్యర్థుల దరఖాస్తులను అధికారులు ఆమోదించారు. 130 నామినేషన్లను తిరస్కరించారు. ఎన్నికల అధికారులు తెలిపిన వివరాల ప్రకారం, మొత్తం 321 నామినేషన్లు స్వీకరించగా, వాటిలో 135 చెల్లుబాటు కాగా 186 తిరస్కరించినట్లు తెలిపారు.
ఉపసంహరణకు...
అభ్యర్థిత్వ ఉపసంహరణకు చివరి తేదీ అక్టోబర్ 24గా నిర్ణయించారు. చివరి జాబితాను ఉపసంహరణ గడువు ముగిసిన అనంతరం విడుదల చేస్తారు. పోలింగ్ నవంబర్ 11న జరగనుంది. కౌంటింగ్ వచ్చే నెల పథ్నాలుగో తేదీన జరగనుంది. జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఉప ఎన్నికలకు సంబంధించి ప్రధాన అభ్యర్థుల నామినేషన్లన్నీ స్క్రూటినీలో అధికారులు ఆమోదించారు. దీంతో ప్రచారాన్ని అన్ని పార్టీల అభ్యర్థులు మరింత వేగం పెంచనున్నారు.