Jubilee Hills Bye Election : ఈవీఎంలు ఎన్ని పెట్టాలో కదా?

జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఉప ఎన్నికకు నామినేషన్ల స్వీకరణ గడువు ముగిసింది.

Update: 2025-10-21 11:23 GMT

జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఉప ఎన్నికకు నామినేషన్ల స్వీకరణ గడువు ముగిసింది. ఈ ఉప ఎన్నికల్లో 150కి పైగా నామినేషన్లు దాఖలయ్యాయి. కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ అభ్యర్థులతో పాటు స్వతంత్ర అభ్యర్థులు కూడా దరఖాస్తు చేశారు. ఇంత పెద్ద సంఖ్యలో నామినేషన్లు దాఖలు కావడానికి రీజనల్ రింగ్ రోడ్డు బాధితులు కారణం. ప్రభుత్వవైఖరిని నిరసిస్తూ వారు నామినేషన్లను దాఖలు చేశారు. అయితే ఈ నామినేషన్లన్నీ కనుక స్క్రూటినీ లో ఓకే అయి, ఎవరూ ఉపసంహరించుకోకుంటే ఎన్ని ఈవీఎంలను పెట్టాలన్నదానిపై అధికారులు నిర్ణయించాల్సి ఉంటుంది.

ప్రభుత్వంపై నిరసనతో...
రీజనల్ రింగ్ రోడ్ బాధితులతో పాటు ఉస్మానియా యూనివర్సిటీకి చెందిన విద్యార్థులు, నిరుద్యోగ సంఘాల నేతలు కూడా పెద్ద సంఖ్యలో నామినేషన్లు దాఖలు చేశారు. నామినేషన్లు గడువు ముగియడంతో రేపు నామినేషన్లపరిశీలన ఉంటుంది. ఈ నెల 24వ తేదీ వరకూ నామినేషన్లను ఉపసంహరించుకోవడానికి గడువు ఉంది.నవంబరు 11వ తేదీన జూబ్లీహిల్స్ నియోజకవర్గం ఉప ఎన్నిక జరగనుంది. 14వ తేదీన కౌంటింగ్ జరగనుంది. ఉప ఎన్నిక ప్రచారం ఇప్పటికే ఊపందుకుంది. బస్తీల్లో సమావేశాలను ఏర్పాటు చేసిపార్టీల నేతలు హామీలు ఇస్తున్నారు.


Tags:    

Similar News