ఎన్టీఆర్ ఘాట్ కు జూనియర్ ఎన్టీఆర్

ఎన్టీఆర్ జయంతి సందర్భంగా హైదరాబాద్ లోని ఎన్టీఆర్ ఘాట్ వద్ద జూనియర్ ఎన్టీఆర్, కల్యాణ్ రామ్ నివాళులు అర్పించారు

Update: 2025-05-28 03:02 GMT

ఎన్టీఆర్ జయంతి సందర్భంగా హైదరాబాద్ లోని ఎన్టీఆర్ ఘాట్ వద్ద జూనియర్ ఎన్టీఆర్, కల్యాణ్ రామ్ నివాళులు అర్పించారు. తెలుగు ప్రజలకు ఆయన చేసిన సేవలను వారు గుర్తుచేసుకున్నారు. జూనియర్ ఎన్టీఆర్ ఎన్టీఆర్ ఘాట్ కు వస్తున్నారని తెలిసి పెద్దయెత్తున అభిమానులు తరలి వచ్చారు. దీంతో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

భారీగా అభిమానులు...
ఉదయాన్నే జూనియర్ ఎన్టీఆర్, కల్యాణ్ రామ్ లు వచ్చి ఎన్టీఆర్ ఘాట్ వద్ద నివాళులర్పించి తాతను స్మరించుకుని ఆయన చేసిన సేవలను కొనియాడారు. ఎన్టీఆర్ తమ కుటుంబానికి మాత్రమే కాకుండా తెలుగు ప్రజలందరికీ మార్గదర్శకులని కొనియాడారు. ప్రముఖుల రాక సందర్భంగా ఎన్టీఆర్ ఘాట్ వద్ద పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు.


Tags:    

Similar News