Hyderabad : హైదరాబాద్ లో భారీ వర్షం
హైదరాబాద్ లో భారీ వర్షం కురిసింది. ఉదయం ఎనిమిది గంటలకు ప్రారంభమయిన వర్షం దాదాపు గంటసేపు పడింది
Ap weather updates
హైదరాబాద్ లో భారీ వర్షం కురిసింది. ఉదయం ఎనిమిది గంటలకు ప్రారంభమయిన వర్షం దాదాపు గంటసేపు పడింది. హైదరాబాద్ లోని అనేక ప్రాంతాల్లో వర్షం కురియడంతో నగరవాసులు ఉపశమనం పొందారు. ఎండవేడిమి, ఉక్కపోత నుంచి కొంత ఈరోజు హైదరాబాద్ వాసులకు ఉపశమనం కలిగింది.
ఉదయం నుంచే...
ఉదయం నుంచే వాతావరణం చల్లబడింది. అయితే వర్షం కురుస్తుందా? లేదా? అనుకుంటున్న తరుణంలో భారీ వర్షం నమోదయింది. అనేక ప్రాంతాలు వర్షంతో తడిసి ముద్దయ్యాయి. రహదారులు జలమయి మయ్యాయి. గత కొద్ది రోజులుగా మండే ఎండలతో అల్లాడిపోతున్న ప్రజలకు ఈ వర్షంతో పాటు చల్లటి గాలులు సేదతీరేలా చేశాయి