హైదరాబాద్ లో తాలిబన్ రూల్ పెట్టారంటున్న రామ్ గోపాల్ వర్మ

Update: 2022-10-14 02:36 GMT

సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఎప్పుడు ఏ విషయంపై స్పందిస్తారో ఆయనకే తెలియదు. తాజాగా హైదరాబాద్ లోని పబ్స్ పై తెలంగాణ ప్రభుత్వం పెట్టిన ఆంక్షలపై స్పందించారు. హైద‌రాబాద్‌లో 10 గంట‌ల త‌ర్వాత ప‌బ్స్ లో మ్యూజిక్ బంద్ చేయాలనే నియ‌మాన్ని తెలంగాణ ప్ర‌భుత్వం విధించింది. దీనిపై ఆర్జీవీ ప్రశ్నించారు.

''మ‌న‌మంతా ఒకే దేశంలో ఉన్నాం. దాని పేరు ఇండియా. అందులోని హైద‌రాబాదీలు మాత్ర‌మే ఎందుకు తాలిబన్ (Taliban) పాల‌న‌లో ఉండాలి సార్‌? దేశ‌మంత‌టా రాత్రి ఒక గంట త‌ర్వాత ఎలాంటి భారీ శ‌బ్దాల‌తో మ్యూజిక్ ప్లే చేయ‌కూడ‌ద‌నే నియ‌మం ఉంది. కానీ హైద‌రాబాద్‌లో మాత్రం ప‌ది గంట‌ల‌కే మ్యూజిక్ ఆపేయాలని ఆ నియ‌మాన్ని ఎందుకు పెట్టారు'' అని ప్రశ్నించాడు వర్మ. ''యాక్సిడెంట్ జ‌రిగితే ట్రాఫిక్‌ను ఆపేస్తారా!. రాత్రి ప‌ది గంట‌ల త‌ర్వాత శ‌బ్దం ఉండ‌కూడ‌ద‌ని వాహ‌నాల‌కు సిటీలోకి రానివ్వ‌రా!..'' వంటి ప్ర‌శ్న‌ల‌ను వేశారు. హైద‌రాబాద్ విశ్వ‌న‌గ‌రంగా మారింద‌ని చాలా మంది దేశ విదేశాల నుంచి వస్తారని, వీరిలో కొందరు నైట్ లైఫ్‌లో భాగ‌మైన ప‌బ్స్‌కు వెళ్ల‌టానికి ఆస‌క్తి చూపిస్తార‌ని అటువంటి వారికి నో మ్యూజిక్ ఆఫ్ట‌ర్ 10 పాల‌సీ గురించి ఏం చెబుతామంటూ ప్రశ్నించారు. #HyderabadTaliban హ్యాష్‌ట్యాగ్‌తో వరుస ట్వీట్‌లలో, తెలంగాణ ప్రభుత్వం, హైదరాబాద్ నగర పోలీసులను ఈ నిబంధనలను తొలగించాలని కోరారు. ఇది కొనసాగితే పెట్టుబడిదారులను హైదరాబాద్ వంటి నగరాలకు దూరం చేసే అవకాశం ఉందని హెచ్చరించారు.


Tags:    

Similar News