నేటి నుంచి హైదరాబాద్ లో ఇంటర్నేషనల్ కైట్ ఫెస్టివల్
నేటి నుంచి హైదరాబాద్ లో అంతర్జాతీయ కైట్ ఫె్టివల్ జరగనుంది
నేటి నుంచి హైదరాబాద్ లో అంతర్జాతీయ కైట్ ఫె్టివల్ జరగనుంది. మొత్తం మూడు రోజుల పాటు ఈ ఫెస్టివల్ జరగనుంది. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో మూడు రోజుల సంక్రాంతి వేడుకలలో భాగంగా నిర్వహించే అంతర్జాతీయ పతంగుల పండుగకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు పూర్తిచేసింది. పర్యాటక–సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు మంగళవారం సాయంత్రం నాలుగు గంటలకు ఈ కార్యక్రమాన్ని అధికారికంగా ప్రారంభించనున్నారు.
13 నుంచి 15 వరకు వేడుకలు...
తెలంగాణ టూరిజం శాఖ ఆధ్వర్యంలో జనవరి 13 నుంచి 15 వరకు ఈ పండుగ సాగనుంది. సంప్రదాయ క్రీడలు, వంటకాల వారసత్వం, సాంస్కృతిక ప్రదర్శనలు ప్రధాన ఆకర్షణగా ఉండనున్నాయి. 19 దేశాల నుంచి 40 మంది అంతర్జాతీయ గాలిపటాల కళాకారులు, దేశవ్యాప్తంగా 15 రాష్ట్రాల నుంచి 55 మంది గాలిపటాల కళాకారులు పాల్గొననున్నారు. భారీగా, ప్రత్యేక డిజైన్లతో తయారైన గాలిపటాలు, రాత్రివేళ గాలిపటాల ప్రదర్శనలు సందర్శకులను ఆకట్టుకోనున్నాయి.
సంప్రదాయ వంటకాలు...
పతంగుల పండుగతో పాటు ‘కల్చర్ లాంగ్వేజ్ ఇండియన్ కనెక్షన్స్’ సహకారంతో మిఠాయిల పండుగ నిర్వహించనున్నారు. ఫుడ్ కోర్టులో 60 స్టాళ్లలో పంజాబ్, గుజరాత్, పశ్చిమ బెంగాల్, కేరళ, మహారాష్ట్ర తదితర రాష్ట్రాల మహిళలు ఇంట్లో తయారైన సంప్రదాయ వంటకాలను ప్రదర్శించి విక్రయించనున్నారు. స్థానిక కళాకారులకు తోడ్పాటు అందించేలా చేనేత–హస్తకళల కోసం మరో 100 స్టాళ్లు కేటాయించారు.