నేడు హైదరాబాద్ కు జస్టిస్ సుదర్శన్ రెడ్డి
నేడు హైదరాబాద్ కు ఇండి కూటమి ఉప రాష్ట్రపతి అభ్యర్థి జస్టిస్ సుదర్శన్ రెడ్డి రానున్నారు
నేడు హైదరాబాద్ కు ఇండి కూటమి ఉప రాష్ట్రపతి అభ్యర్థి జస్టిస్ సుదర్శన్ రెడ్డి రానున్నారు. ఇప్పటికే ఉప రాష్ట్రపతిగా నామినేషన్ వేసిన జస్టిస్ సుదర్శన్ రెడ్డి ఇక తనకు మద్దతు ప్రకటించాలని కోరుతూ పలువురు రాజకీయ పార్టీల అగ్రనేతలను ఆయన కలిసే అవకాశముందని తెలిసింది. జస్టిస్ సుదర్శన్ రెడ్డిని తమ అభ్యర్థిగా ఇండి కూటమి పోటీకి దింపిన సంగతి తెలిసిందే.
రేవంత్ కలిసే ఛాన్స్...
నేడు జస్టిస్ సుదర్శన్ రెడ్డి హైదరాబాద్ కు రానుండటంతో ఆయనను తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కలిసే అవకాశముందని చెబుతున్నారు. అయితే సుదర్శన్ రెడ్డి తెలంగాణలో ఎవరెవరెవరిని కలుస్తారన్న విషయంపై ఇంతవరకూ అధికారికంగా తెలియలేదు కానీ, బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ ను కూడా కలుస్తారంటున్నారు. అలాగే రాజకీయ నేతలతో సమావేశమవుతారని తెలిసింది.