Hyderabad : ఇరవై కోట్ల నగదు..బంగారం, వెండి స్వాధీనం
హైదరాబాద్ లోని పిస్తా హౌస్, షా గౌస్ బిర్యానీ హోటళ్ల యజమానుల ఇళ్లలో ఇరవై కోట్ల రూపాయల నగదును ఆదాయపు పన్ను శాఖ అధికారులు స్వాధీనం చేసుకున్నారు
హైదరాబాద్ లోని పిస్తా హౌస్, షా గౌస్ బిర్యానీ హోటళ్ల యజమానుల ఇళ్లలో ఇరవై కోట్ల రూపాయల నగదును ఆదాయపు పన్ను శాఖ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. రెండు రోజుల నుంచి పిస్తా హౌస్, షా గౌస్ బిర్యానీ హోటళ్ల యజమానులు, డైరెక్టర్ల ఇళ్లలో ఆదాయపు పన్ను శాఖల అధికారులు సోదాలు నిర్వహించారు. ఆదాయపు పన్ను ఎగవేస్తున్నారన్నకారణంగా ఈ సోదాలు నిర్వహించారు.
బంగారం, వెండి ఆభరణాలు...
అయితే ఈ సోదాల్లో భారీగా నగదుతో పాటు బంగారం, వెండి ఆభరణాలను కూడా ఆదాయపు పన్ను శాఖ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. పెద్దమొత్తంలో ఆస్తిపత్రాలను కూడా ఈసోదాల్లో గుర్తించారు. ఇరవై కోట్ల రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నట్లు తెలిసింది. దీంతో ఇంకా పెద్దమొత్తంలోనే ఆస్తులు, నగదు బయటపడే అవకాశముందన్న అంచనాలు వినపడుతున్నాయి.