Hyderabad : పిస్తా హౌస్ పై ఐటీ దాడులు
హైదరాబాద్ లో ఆదాయపు పన్ను అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు.
హైదరాబాద్ లో ఆదాయపు పన్ను అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. పిస్తా హౌస్, షా గౌస్ కార్యాలయాల్లో ఈ సోదాలను ఉదయం నుంచి సోదాలను నిర్వహిస్తున్నారు. మొత్తం పదిహేను బృందాలుగా విడిపోయి హైదరాబాద్ నగరంలోని పలు ప్రాంతాల్లో ఈ సోదాలు నిర్వహిస్తున్నారు. హైదరాబాద్ బిర్యానీకి ఫేమస్ అయిన పిస్తా హౌస్, షా గౌస్ హోటళ్ల యాజమాన్యాలు, డైరెక్టర్ల ఇళ్లలోనూ సోదాలు జరుగుతున్నాయి.
ఆదాయపు పన్ను చెల్లించకపోవడంతో...
ఆదాయం అధికంగా వస్తున్నా పన్ను చెల్లింపు సక్రమంగా జరపడం లేదన్న ఫిర్యాదు మేరకు ఆదాయపు పన్ను అధికారులు ఈ సోదాలు నిర్వహిస్తున్నారు. నెలకు కోట్లలో వ్యాపారం చేస్తున్నప్పటికీ, అనేక శాఖలు నగరంలో ఉన్నప్పటికీ ఆదాయపు పన్ను చెల్లించకపోవడంపై ఈ దాడులు జరుగుతున్నట్లు తెలిసింది. ఈ రోజు సాయంత్రం వరకూఆదాయపు పన్ను అధికారులు సోదాలు నిర్వహించే అవకాశముంది.