మాజీ ఎంపీ ఇంట్లో ఐటీ సోదాలు
హైదరాబాద్ లోని మాజీ ఎంపీ రంజిత్ రెడ్డి ఇళ్లు, కార్యాలయాలపై ఆదాయపుపన్ను శాఖ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు
హైదరాబాద్ లోని మాజీ ఎంపీ రంజిత్ రెడ్డి ఇళ్లు, కార్యాలయాలపై ఆదాయపుపన్ను శాఖ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. గతంలో బీఆర్ఎస్ ఎంపీగా పనిచేసిన రంజిత్ రెడ్డి డీఎస్ఆర్ గ్రూప్ ఆఫ్ కనస్ట్రక్షన్స్ కార్యాలయాలు, డైరెక్టర్ ఇళ్లలో సోదాలు జరుగుతున్నాయి. ఈ కంపెనీలో మాజీ ఎంపీ రంజిత్ రెడ్డితో పాటు ఆయన భార్య కూడా డైరెక్టర్ గా ఉన్నారు.
ఐటీ చెల్లింపుల్లో...
ఆదాయపు పన్ను శాఖ అధికారులు ఏకకాలంలో మొత్తం పది చోట్ల సోదాలు నిర్వహిస్తున్నారు. డీఎస్ఆర్ గ్రూప్ కన్‍స్ట్రక్షన్ కంపెనీ డైరెక్టర్స్ ఇళ్లల్లో కూడా కొనసాగుతున్న ఐటీ సోదాలు జరుగుతున్నాయి. మొత్తం ఏకకాలంలో పది చోట్ల కొనసాగుతున్న సోదాలలో పలు కీలక డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నారని తెలిసింది. టాక్స్ చెల్లింపుల్లో అవకతవకలు జరిగినట్లు ఐటీ శాఖ గుర్తించినట్లు ప్రాధమికంగా అందుతున్న సమాచారాన్ని బట్టి తెలుస్తోంది.