Hyderabad : హైదరాబాద్ లో ఐటీ సోదాలు

హైదరాబాద్ లో ఆదాయపుపన్ను శాఖ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ఏకకాలంలో మొత్తం పది చోట్ల ఆదాయపు పన్ను శాఖ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు

Update: 2025-08-19 04:35 GMT

హైదరాబాద్ లో ఆదాయపుపన్ను శాఖ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ఏకకాలంలో మొత్తం పది చోట్ల ఆదాయపు పన్ను శాఖ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ఈ ఐటీ సోదాలు డీఎస్ఆర్ గ్రూప్ కన్‍స్ట్రక్షన్ కంపెనీలో జరుగుతున్నాయి. భారీగా పన్ను ఎగవేశారన్న ఆరోపణలపై ఈ సోదాలు చేస్తున్నట్లు సమాచారం.

డీఎస్ఆర్ గ్రూప్ కన్‍స్ట్రక్షన్ కంపెనీ ...
డీఎస్ఆర్ గ్రూప్ కన్‍స్ట్రక్షన్ కంపెనీ డైరెక్టర్స్ ఇళ్లల్లో కూడా కొనసాగుతున్న ఐటీ సోదాలు జరుగుతున్నాయి. మొత్తం ఏకకాలంలో పది చోట్ల కొనసాగుతున్న సోదాలలో పలు కీలక డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నారని తెలిసింది. టాక్స్ చెల్లింపుల్లో అవకతవకలు జరిగినట్లు ఐటీ శాఖ గుర్తించినట్లు ప్రాధమికంగా అందుతున్న సమాచారాన్ని బట్టి తెలుస్తోంది.


Tags:    

Similar News