హాస్టల్ లో డ్రోన్స్ తయారు చేస్తూ ఉంటే.. ఆర్మీ కొంటోంది

రాడార్ ప్రూఫ్ కామికేజ్ డ్రోన్లు 300 కిలో మీటర్ల వేగంతో వెళ్లగలవు. అలాంటి డ్రోన్స్ ను బిట్స్ పిలానీ హైదరాబాద్ క్యాంపస్‌లోని హాస్టల్ గదిలో తయారు చేస్తున్నారు.

Update: 2025-07-22 14:45 GMT

రాడార్ ప్రూఫ్ కామికేజ్ డ్రోన్లు 300 కిలో మీటర్ల వేగంతో వెళ్లగలవు. అలాంటి డ్రోన్స్ ను బిట్స్ పిలానీ హైదరాబాద్ క్యాంపస్‌లోని హాస్టల్ గదిలో తయారు చేస్తున్నారు. వాటిని ఏకంగా భారత సైన్యం కొనుగోలు చేసింది. ఇద్దరు 20 ఏళ్ల ఇంజనీరింగ్ విద్యార్థులు జమ్మూ, హర్యానాలోని చండిమందిర్, బెంగాల్‌లోని పనాగఢ్, అరుణాచల్ ప్రదేశ్‌లోని ఆర్మీ యూనిట్లకు అత్యాధునిక యుఏవీలను అమ్మేస్తున్నారు. వారు భారతదేశ రక్షణ వర్గాలను కూడా తమ ప్రోడక్ట్స్ తో ఆశ్చర్యపరిచారు. వారి స్టార్టప్ అపోలియన్ డైనమిక్స్‌ను ప్రారంభించిన రెండు నెలల్లోనే ఇది చేసి చూపించారు. రాజస్థాన్‌లోని అజ్మీర్‌కు చెందిన మెకానికల్ ఇంజనీరింగ్ విద్యార్థి జయంత్ ఖత్రి, కోల్‌కతాకు చెందిన ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ విద్యార్థి సౌర్య చౌదరి దీని వెనుక ఉన్నారు. భారత్ డ్రోన్స్ విషయంలో ఇతర దేశాల మీద ఆధారపడకూడదన్నదే తమ లక్ష్యమని వీరు స్పష్టం చేశారు.

Tags:    

Similar News