Hydra : హైడ్రా జూలు విదిల్చింది.. మూడు వేల కోట్ల విలువైన భూములకు రక్షణ

మియాపూర్ లో హైడ్రా అధికారులు అత్యంత విలువైన భూమిని తిరిగి స్వాధీనం చేసుకున్నారు.

Update: 2026-01-10 13:14 GMT

హైదరాబాద్ లో భూముల విలువ పెరుగుతున్న కొద్దీ వాటిని కబ్జా చేసే వారు కూడా ఎక్కువయ్యారు. అయితే రాష్ట్ర ప్రభుత్వం హైడ్రా తెచ్చిన తర్వాత వేల కోట్ల రూపాయల విలువైన భూములను తిరిగి ప్రభుత్వ పరం చేసింది. తాజాగా రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి నియోజకవర్గంలోని మియాపూర్ లో హైడ్రా అధికారులు అత్యంత విలువైన భూమిని తిరిగి స్వాధీనం చేసుకున్నారు. ఈ భూమి విలువ మూడు వేల కోట్ల రూపాయల వరకూ అంచనా వేస్తుంది. అయితే గత కొద్ది రోజుల నుంచి ఈ విలువైన భూమిని సొంతం చేసుకోవడానికి కొందరు ప్రయత్నిస్తున్నారు.

ఫోర్జరీ పత్రాలను సృష్టించి...
మియాపూర్ లోని సర్వే నెంబరు 44లో ఫోర్జరీ పత్రాలను సృష్టించి దాదాపు నలభై మూడు ఎకరాలను కబ్జా చేసేందుకు ప్రయత్నాలు మొదలు పెట్టారు. 159 సర్వే నెంబర్ లోని ఈ భూమిలో ఇప్పటికే ఎకరం పైగా భూమిని ఒక వ్యక్తి ఆక్రమించారని హైడ్రా అధికారులకు ఫిర్యాదులు అందాయి. దీంతో అతని పై కేసు నమోదయింది. ఇమ్రాన్ అనే వ్యక్తితో పాటు మరికొందరిపై కేసులు నమోదయ్యాయి. దీంతో హైడ్రా అధికారులు బుల్ డోజర్లతో వచ్చారు. ఆక్రమిత భూములో నిర్మించిన వాటిని తొలగించి తిరిగి ప్రభుత్వ పరం చేసుకున్నారు.
మూడు వేల కోట్ల విలువైన...
ఈ ఎకరన్నరంలో ఆక్రమణలను తొలగించమే కాకుండా మరో ఐదు ఎకరాలను కూడా కబ్జాల చెర నుంచి విముక్తి కల్పించింది హైడ్రా. అక్కడ ఏర్పాటు చేసిన పద్దెనిమిది షట్టర్లను తొలగించారు. ఈ భూమిపై విచారణ జరిపి అది ప్రభుత్వ భూమి అని తేలిన తర్వాత మాత్రమే అక్కడి ఆక్రమణలను తొలగించామని హైడ్రా కమిషనర్ రంగనాధ్ తెలిపారు. ప్రభుత్వ భూమిలో ఆక్రమణలను తొలగించిన హైడ్రా అధికారులు అక్కడ చుట్టూ ఫెన్సింగ్ ఏర్పాటు చేసి బోర్డును కూడా ఏర్పాటు చేసి మూడు వేల కోట్ల రూపాయల విలువైన ప్రభుత్వ భూమిని రక్షించగలిగారు.
Tags:    

Similar News