Hydra : మాదాపూర్ లో ఆక్రమణలను కూల్చివేసిన హైడ్రా

హైదరాబాద్ లో ఆక్రమణలను తొలగించడంలో హైడ్రా అధికారులు వేగం పెంచారు.

Update: 2025-06-30 02:28 GMT

హైదరాబాద్ లో ఆక్రమణలను తొలగించడంలో హైడ్రా అధికారులు వేగం పెంచారు. నాలాలు, చెరువులు, పార్క్ స్థలాలను ఆక్రమించి నిర్మించారన్నఆరోపణలు అందినవెంటనే దానిపై వెంటనే విచారించి ఆక్రమణలయితే వెంటనే వాటిని కూల్చి వేస్తున్నారు. తాజాగా మాదాపూర్ పరిధిలోని సున్నం చెరువులోని ఆక్రమణలను హైడ్రా కూల్చివేసింది.

సున్నం చెరువులో...
దాదాపు 32 ఎకరాల విస్తీర్ణం ఉన్న సున్నం చెరువులో పెద్దయెత్తున ఆక్రమణలు చోటు చేసుకున్నాయని గుర్తించిన అధికారులు వాటిని తొలగిస్తున్నారు. ఎఫ్.టి.ఎల్ పరిధిలో అక్రమంగా నిర్మించిన వాటిని కూల్చివేశారు. కొందరు గుడెసెలు వేసుకుని అక్కడ ఉండటంతో పాటు అక్కడ అక్రమ నీటి వ్యాపారం సాగుతుందని గుర్తించిన అధికారులు అక్కడి నీటిని వినియోగవించవద్దని సూచించింది. అనేక వాటర్ ట్యాంకర్లను సీజ్ చేసింది. పోలీసు బందోబస్తు మధ్య ఆక్రమణలను కూల్చివేశారు.


Tags:    

Similar News