Hydraa : హైదరాబాద్ లో హైడ్రా కూల్చివేతలు నేడు ఎక్కడంటే?
తారానగర్ లింగంపల్లిలో కొందరు నాలాలను ఆక్రమించి కట్టిన నిర్మాణాలను హైడ్రా అధికారులు కూల్చివేస్తున్నారు.
హైదరాబాద్ లో హైడ్రా కూల్చివేతలు కొనసాగుతున్నాయి. నాలాలు ఆక్రమించుకుని, చెరువులను కబ్జా చేసి నిర్మించిన కట్టడాలను తొలగిస్తున్నారు. ముందుగా నోటీసులు ఇచ్చిన తర్వాత ఆక్రమణలుగా గుర్తించి వాటిని అధికారులు కూల్చివేస్తున్నారు. ఈరోజు తారానగర్ లింగంపల్లిలో ఆక్రమణలను హైడ్రా అధికారులు కూల్చివేస్తున్నారు.
లింగంపల్లిలో...
తారానగర్ లింగంపల్లిలో కొందరు నాలాలను ఆక్రమించి కట్టిన నిర్మాణాలను కూల్చివేస్తున్నారు. వారికి ముందుగానే నోటీసులు ఇచ్చిన హైడ్రా అధికారులు ఈరోజు ఉదయం నుంచి బుల్ డోజర్లతో వచ్చి కూల్చివేతలను ప్రారంభించారు. ఆక్రమణదారులు అడ్డుకోకుండా భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. కొందరు ఆందోళనకు దిగినా వారిని పక్కకు లాగి ఆక్రమణలను కూల్చివేస్తున్నారు.