Hydra : హైదరాబాద్ లో ప్రతి రోజూ క్లౌడ్ బరస్ట్ .. దానికి కారణమిదే
హైదరాబాద్ లో తరచూ క్లౌడ్ బరస్ట్ జరుగుతుందని హైడ్రా కమిషనర్ రంగనాధ్ తెలిపారు.
హైదరాబాద్ లో తరచూ క్లౌడ్ బరస్ట్ జరుగుతుందని హైడ్రా కమిషనర్ రంగనాధ్ తెలిపారు. ప్రతిరోజూ ఎక్కడో ఒకచోట క్లౌడ్ బరస్ట్ జరుగుతుందని అన్నారు. నిన్న కుత్బుల్లాపూర్ లో పద్దెనిమిది సెంటీమీటర్ల వర్షపాతం నమోదయిందని తెలిపారు. నగరంలో ఎక్కువగా పగటి పూట ఉష్ణోగ్రతలు ఎక్కువగా నమోదవుతున్నాయని, నగర శివార్లలో ఉష్ణోగ్రతలు తక్కువగా నమోదవుతున్నాయని హైడ్రా కమిషనర్ రంగనాధ్ చెప్పారు.
నగరంలోనే అధిక ఎండలు...
ఈ క్లౌడ్ బరస్ట్ కారణంతో తక్కువ సమయంలో ఎక్కువ వర్షపాతం నమోదవుతుందని ఆయన అన్నారు. అందుకే హైదరాబాద్ నగరంలో ఫ్లడ్ కంట్రోల్ కు అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని హైడ్రా కమిషనర్ రంగనాధ్ అన్నారు. ఇందుకోసం నాలాలపై ఆక్రమణలను తొలిగించాలని అన్నారు. అధిక ఎండ వల్లనే నగరంలో ఎక్కువ వర్షపాతం నమోదవుతుందని, ఫ్లడ్ మేనేజ్ మెంట్ తో ఫ్లడ్ కంట్రోల్ చేయవచ్చని హైడ్రా కమిషనర్ రంగనాధ్ చెప్పారు.