వామ్మో.. ఈరోజు హైదరాబాద్ లో ఉష్ణోగ్రత ఎలా ఉందంటే?

గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ (GHMC) లిమిట్స్ లో ఉష్ణోగ్రతలు భారీగా

Update: 2024-03-02 11:03 GMT

గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ (GHMC) లిమిట్స్ లో ఉష్ణోగ్రతలు భారీగా పెరిగిపోయాయి. మార్చిలోకి అలా అడుగుపెట్టామో లేదో హైదరాబాద్ లో ఎండలు మండిపోతున్నాయి. ఈరోజు బేగంపేట (38.6 ° C), సరూర్‌నగర్ (38.3 ° C) లలో 38 ° సెల్సియస్‌ ఉష్ణోగ్రతలు దాటిపోయాయి. కార్వాన్ (37.7°C), జూబ్లీహిల్స్ (37.6°C), యూసుఫ్‌గూడ (37.6°C)లు GHMC పరిధిలోని టాప్ 5 హాటెస్ట్ ఏరియాల్లో ఉన్నాయి. పలు ప్రాంతాల్లో 37 డిగ్రీల ఉష్ణోగ్రతను తాకాయి. తెలంగాణ స్టేట్ డెవలప్‌మెంట్ ప్లానింగ్ సొసైటీ (TSDPS) ప్రకారం, రాష్ట్రంలో రాబోయే మూడు రోజులు పొడి వాతావరణం ఉంటుందని.. గరిష్ట ఉష్ణోగ్రతలు 38 డిగ్రీల సెల్సియస్‌ను తాకే అవకాశం ఉందని హెచ్చరించారు. GHMC పరిధిలో, గరిష్ట ఉష్ణోగ్రతలు 34° నుండి 36°C వరకు, కనిష్ట ఉష్ణోగ్రతలు 21°C నుండి 23°C వరకు ఉండనున్నాయి.

ఈ ఏడాది వేసవిలో:
హైదరాబాద్ నగరంలో ఈ ఏడాది వేసవిలో ప్రజలు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంది. మార్చి, ఏప్రిల్‌లలో తరచుగా 40 డిగ్రీల సెల్సియస్ కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు ఉంటాయి. హైదరాబాద్‌లో విపరీతమైన వేడి కారణంగా హీట్ స్ట్రోక్‌లు, సన్ స్ట్రోక్ లు సర్వసాధారణమయ్యాయి. ప్రజలు ఈ ఏడాది వేసవిలో తగినన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. బాగా ఎండగా ఉన్న సమయాల్లో బయటకు వెళ్లడం మానుకోవాలి. 


Tags:    

Similar News