Breaking : పబ్ లు మూయకపోతే.. ఇక అంతే.. సీపీ వార్నింగ్
హైదరాబాద్ పోలీస్ కమిషనర్ కొత్తకోట శ్రీనివాసరెడ్డి కీలక ఆదేశాలు జారీ చేశారు. పబ్ లు సమాయానికి మూసేయాలని ఆదేశించారు
kothakota srinivasa reddy
హైదరాబాద్ పోలీస్ కమిషనర్ కొత్తకోట శ్రీనివాసరెడ్డి కీలక ఆదేశాలు జారీ చేశారు. పబ్ లు సమాయానికి మూసేయాలని ఆదేశించారు. లేకపోతే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సమయానికి మించి ఏమాత్రం పబ్ లు నడిపినా చర్యలు తప్పవని వార్నింగ్ ఇచ్చారు. పబ్ లలో డ్రగ్స్ అమ్మకాలు జరుగుతున్నట్లు ఆరోపణలు ఉన్నాయని కొత్తకోట శ్రీనివాసరెడ్డి అన్నారు.
అప్రమత్తంగా ఉండి...
అందుకే నగర పోలీసులు అప్రమత్తంగా ఉండి పబ్‌లు ఎప్పటికప్పుడు తనిఖీలు చేస్తూ సరైన చర్యలు తీసుకోవాలని కోరారు. పబ్ లపై ప్రత్యేకంగా నిఘా పెట్టాలని నగర పోలీసులను ఆదేశించారు. రెండు నెలల్లో హైదరాబాద్ లో డ్రగ్స్ అనేది కనపడకుండా చేయాలని ఆయన ఆదేశించారు. ఎవరినీ ఉపేక్షించవద్దని, వెంటనే చర్యలు తీసుకోవాలని ఆయన ఆదేశించారు.