ఇకపై బ్యాక్ సీటు బెల్ట్ వాడాల్సిందే

ఇక పై బ్యాక్ సీటు బెల్ట్ పెట్టుకునేలా త్వరలో అమలు చేయబోతున్నామని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ తెలిపారు

Update: 2022-09-29 12:21 GMT

ఫ్రంట్ సీటు బెల్ట్ తో పాటు ఇక పై బ్యాక్ సీటు బెల్ట్ పెట్టుకునేలా త్వరలో అమలు చేయబోతున్నామని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ తెలిపారు. ట్రాఫిక్ సిబ్బందికి 30 శాతం అదనంగా అలవెన్సును ఇచ్చేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. సోషల్ మీడియాను అన్ని విధాలుగా వాడుకునేందుకు ఒక ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేయబోతున్నామని సీవీ ఆనంద్ తెలిపారు. 2005, 2010 బ్యాచ్ లకు చెందిన వారికి ట్రాఫిక్ విభాగంలో ఇచ్చామన్నారు. రాబోయే రోజుల్లో వంద మంది హోంగార్డులను ట్రాఫిక్ విభాగానికి కేటాయిస్తున్నామని చెప్పారు.

ట్రాఫిక్ సమస్యలను...

డయల్ 100 కు 70 నుంచి 80 శాతం ట్రాఫిక్ సమస్యలే వస్తున్నాయని సీవీ ఆనంద్ తెలిపారు. ప్రజలు కూడా ట్రాఫిక్ సమస్య పరిష్కారానికి సహకరించాలని ఆయన కోరారు. ప్రజల నుంచి సహకారం అందితేనే ట్రాఫిక్ సమస్యకు చెక్ పడుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. రోడ్డుగా అడ్డుగా ఉన్న నిర్మాణాలను త్వరలోనే తొలగిస్తామని చెప్పారు. హైదరాబాద్ లో ట్రాఫిక్ సమస్య బాగా పెరిగిపోయిందన్నారు. దీనిని అధిగమించేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. జీహెచ్ఎంసీతో కలసి ట్రాఫిక్ సిబ్బంది ట్రాఫిక్ ఎన్‌ఫోర్సమెంట్ చేస్తామని ఆయన చెప్పారు. క్యారేజీ వేని ఆక్రమిస్తే ఉపేక్షించబోమని ఆయన అన్నారు. ఫుట్ పాత్ ల ఆక్రమణలను కూడా తొలగిస్తామని సీవీ ఆనంద్ తెలిపారు.


Tags:    

Similar News