CV Anand : సీవీ ఆనంద్ ట్వీట్ చూశారా?
హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ ఫ్రెండ్ షిప్ డే సందర్భంగా చేసిన ట్వీట్ వైరల్ గా మారింది
హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ ఫ్రెండ్ షిప్ డే సందర్భంగా చేసిన ట్వీట్ వైరల్ గా మారింది. ప్రపంచంలోనే పెద్ద కంపెనీలకు సీఈఓలు తమ పాఠశాల సీనియర్లని సీవీ ఆనంద్ తెలిపారు. ప్రపంచంలోని దిగ్గజ సంస్థలైన మైక్రోసాఫ్ట్, పీ&జీలకు సారథ్యం వహిస్తున్న సత్య నాదెళ్ల, శైలేష్ జేజురీకర్‌లకు హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ బేగంపేట్‌తో అనుబంధం ఉందన్నారు. శైలేష్ పీ&జీకి తొలి భారతీయ సీఈవో కానుండగా, ఆయన, సత్య నాదెళ్ల హెచ్.పి.ఎస్ లో క్లాస్‌మేట్స్అని చెప్పారు. వీరిద్దరికీ క్రికెట్‌తో బలమైన అనుబంధం ఉందని పోలీస్ కమిషనర్ సి.వి. ఆనంద్ తెలిపారు.
ఒకే పాఠశాలలో చదివి...
ఒకే పాఠశాలలో చదివి, ప్రపంచ స్థాయి కంపెనీలకు నాయకత్వం వహించడం గర్వకారణమని ఆయన పేర్కొన్నారు. ప్రపంచంలోని అతి పెద్ద సంస్థలకు నాయకత్వం వహిస్తున్న ఇద్దరు ప్రముఖులైన సత్య నాదెళ్ల మైక్రోసాఫ్ట్ సీఈవోగా, శైలేష్ జేజురీకర్ P&Gకి కాబోయే నూతన సీఈవో’లకు హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ బేగంపేట్‌తో బలమైన అనుబంధం ఉందని చెప్పారు. ఈ ఇద్దరు దిగ్గజాలు హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ లో తమ విద్యాభ్యాసం సాగించడమే కాకుండా.. వారికి క్రికెట్‌తో కూడా బలమైన అనుబంధం ఉందని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సి.వి. ఆనంద్ వెల్లడించారు.