Hyderabad : హైదరాబాద్ లో భారీగా ట్రాఫిక్ జామ్

మూసాపేటలోని భరత్ నగర్ వంతెనపై భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది

Update: 2024-05-23 07:12 GMT

హైదరాబాద్ లో ట్రాఫిక్ నిలిచిపోవడం మామూలే. ఎన్ని ఫ్లై ఓవర్లు కట్టినా, మెట్రో రైళ్లు వేసినా ట్రాఫిక్ రద్దీ మాత్రం తగ్గడం లేదు. తాజాగా మూసాపేటలోని భరత్ నగర్ వంతెనపై భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది. ఈ వంతెన మధ్యలో వాటర్ ట్యాంకర్ ఆగిపోవడంతో ట్రాఫిక్ నిలిచిపోయి కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి.

భరత్ నగర్ వంతెనపై...
వాటర్ ట్యాంకర్ టైరు పేలి అక్కడే నిలిచిపోవడంతో ట్రాఫిక్ సమస్య తలెత్తింది. భరత్ నగర్ వంతెన పై నుంచి వై జంక్షన్ వరకూ భారీగా ట్రాఫిక్ సమస్య తలెత్తింది. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. గంటల కొద్దీ వాహనాలు నిలిచిపోవడంతో ఉదయం ఆఫీసులకు వెళ్లే వాళ్లు అవస్థలు పడ్డారు.


Tags:    

Similar News