Hyderabad : హైదరాబాద్ లో రాత్రి నుంచి భారీ వర్షం.. నీట మునిగిన రహదారులు

హైదరాబాద్ లో రాత్రి నుంచి భారీ వర్షం కురుస్తుంది. వినాయక చవితి రోజున వర్షం కురుస్తుండటంతో ప్రజలు అవస్థలు పడుతున్నారు.

Update: 2025-08-27 02:00 GMT

హైదరాబాద్ లో రాత్రి నుంచి భారీ వర్షం కురుస్తుంది. వినాయక చవితి రోజున వర్షం కురుస్తుండటంతో ప్రజలు అవస్థలు పడుతున్నారు. వినాయకుడి ప్రతిమను, పత్రిని తెచ్చుకునేందుకు ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. నిన్న సాయంత్రం నుంచి ప్రారంభమయిన వర్షం ఇంకా కురుస్తూనే ఉంది. ఉదయం అయినా వర్షం వీడకపోవడంతో వినాయక చవితి పండగను జరుపుకునేందుకు ప్రజలు వీధుల్లోకి వచ్చేందుకు వర్షపు నీటిలోనే రావాల్సి ఉంది. రాత్రి నుంచి కురుస్తున్న భారీ వర్షానికి నగరంలోని పలు ప్రాంతాలు నీటిలో నానుతున్నాయి.

లోతట్టు ప్రాంతాల్లో నిలిచిన నీరు...
హైదరాబాద్ లోని అనేక లోతట్టు ప్రాంతాల్లో ఇళ్లలోకి నీరు చేరింది. పండగ వేళ వర్షం కురుస్తుండటంతో ఇంట్లోకి చేరిన నీటిని బయటకు తోడేందుకు అవస్థలు పడుతున్నారు. రహదారులన్నీ నీట మునిగాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావం ఫలితంగా నిన్న సాయంత్రం నుంచి మొదలయిన వర్షం విడవకుండానే కురుస్తూనే ఉంది. దీంతో వ్యాపారులకు కూడా అమ్మకాలు జరగక ఈ ఏడాది నష్టపోవాల్సి వస్తుందని ఆవేదన చెందుతున్నారు. అనేక ప్రాంతాల్లో గణేశ్ విగ్రహాలు అలాగే ఉన్నాయి.
వ్యాపారాలకు ఇబ్బందులే...
రహదారులపై నీరు చేరడంతో వెళ్లేందుకు కూడా ప్రజలు జంకుతున్నారు. వినాయక చవితి రోజున కురుస్తున్న వర్షంతో పండ్లు, పూల వ్యాపారులు కూడా వ్యాపారాలు లేవని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నిన్న రాత్రి నుంచి కురుస్తున్న భారీ వర్షానికి అనేక వినాయక మండపాల్లోకి కూడా నీరు చేరిందని నిర్వాహకులు ఆందోళన చెందుతున్నారు. వినాయక చవితి రోజున పండగ జరుపకునేందుకు ప్రతి ఒక్కరూ బయటకు వచ్చి పండగకు కావాల్సిన సామాగ్రిని కొనుగోలు చేయాల్సి రావడంతో కొంత ఇబ్బందులు ఎదురయ్యాయి.


Tags:    

Similar News