దేశం కోసం ఎంతో చేశాడు.. సొంత భూమి కోసం సైనికుడి 37 ఏళ్ల పోరాటం
హైదరాబాద్ పాతబస్తీకి చెందిన యూసఫ్ భారత సైన్యంలో పని చేశారు.
హైదరాబాద్ పాతబస్తీకి చెందిన యూసఫ్ భారత సైన్యంలో పని చేశారు. 1971 భారత్-చైనా యుద్ధంలో పాల్గొని తీవ్రంగా గాయపడ్డారు. 1988లో అప్పటి ప్రభుత్వం రంగారెడ్డి జిల్లా బాటసింగారం రెవెన్యూలోని సర్వే నంబరు 303, 393లో ఐదెకరాల ప్రభుత్వ భూమిని కేటాయించింది. శత్రు దేశం నుండి వచ్చే వారితో యుద్ధం చేసిన ఆయన.. సొంత భూమి కోసం 75 ఏళ్ల వయసు లో పెద్ద పోరాటాన్నే చేస్తున్నారు. ఆయనకు ఇచ్చిన భూమి కబ్జా కోరల్లో ఉంది. తనకు న్యాయం చేయాలంటూ 37 ఏళ్లుగా కలెక్టరేట్, ఆర్డీవో, తహసీల్దార్ కార్యాలయాల చుట్టూ తిరుగుతూనే ఉన్నారాయన. యుద్ధంలో గాయం కన్నా ఇప్పుడు ఎక్కువ బాధ అనుభవిస్తున్నానని ఆయన తన బాధను వ్యక్తం చేస్తున్నారు.