సరూర్ నగర్లో జీఎస్టీ సీనియర్ ఆఫీసర్ కిడ్నాప్
దిల్ సుఖ్ నగర్ లోని కృష్ణానగర్ లో GST కట్టని ఒక షాపును సీజ్ చేసేందుకు GST ఆఫీసర్ మణిశర్మ, మరో అధికారి ఆనంద్ లు
gst officer mani sharma kidnap
హైదరాబాద్ లో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. సరూర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో GST సీనియర్ ఆఫీసర్ మణిశర్మ కిడ్నాప్ కు గురికావడం తీవ్ర కలకలం రేపింది. దిల్ సుఖ్ నగర్ లోని కృష్ణానగర్ లో GST కట్టని ఒక షాపును సీజ్ చేసేందుకు GST ఆఫీసర్ మణిశర్మ, మరో అధికారి ఆనంద్ లు వెళ్లారు. వారిని షాప్ నిర్వాహకుడు, మరో ముగ్గురు కలిసి కిడ్నాప్ చేసి, ఇన్నోవా కారులో తీసుకెళ్లారు. ఈ మేరకు సమాచారం అందుకున్న పోలీసులు ఇద్దరు GST అధికారులను రెస్క్యూ చేశారు.
మణిశర్మ, ఆనంద్ ల సెల్ఫోన్ సిగ్నల్స్, సీసీ కెమెరాల ఫుటేజీల ఆధారంగా నిందితులను పట్టుకున్నారు. అధికారులను కిడ్నాప్ చేసిన నలుగురిని అరెస్ట్ చేసి, వారిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. కాగా.. GST అధికారులను కిడ్నాప్ చేసి తీసుకెళ్లిన కారుపై టీడీపీ నేత సయ్యద్ ముజీబ్ కు చెందిన స్టిక్కర్ ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ముజీబ్ ఆంధ్రప్రదేశ్ గుంటూరు తూర్పు నియోజకవర్గానికి చెందిన టీడీపీ నేత.