హైదరాబాద్ లో 5.7 లక్షల వీధికుక్కలు

హైదరాబాద్ లో 5.7 లక్షల వీధి కుక్కలున్నట్లు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కమిషనర్ మేయర్ విజయలక్ష్మి తెలిపారు

Update: 2023-02-21 13:37 GMT

హైదరాబాద్ లో 5.7 లక్షల వీధి కుక్కలున్నట్లు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కమిషనర్ మేయర్ విజయలక్ష్మి తెలిపారు. వీటిని జంతు సంరక్షణ కేంద్రాలకు తరలించే ఏర్పాటు చేస్తామని తెలిపారు. అంబర్‌పేట్ లో కుక్కలదాడిలో బాలుడు మృతి చెందిన ఘటన కలకలం రేపడంతో మేయర్ అత్యున్నత సమావేశాన్ని నిర్వహించారు. వీధి కుక్కలను కట్టడి చేసేందుకు కార్పొరేషన్ అన్ని చర్యలు తీసుకుంటుందని తెలిపారు.

తప్పంతా మాపైతే ఎలా?
తప్పంతా గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ వేయడంపై తగదని విజయలక్ష్మి సూచించారు. హైదరాబాద్ లోని ముప్ఫయి సర్కిళ్లలలో ముప్పయి బృందాలను ఏర్పాటు చేసి వీధి కుక్కల బెడదను నివారిస్తామని తెలిపారు. వీధికుక్కలపై ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తామని చెప్పారు. మరోసారి ఇలాంటి ఘటన పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామని మేయర్ విజయలక్ష్మి తెలిపారు. వీధికుక్కలు ఉన్న ప్రాంతాల వారు తమ కార్యాలయానికి ఫోన్ చేసి చెప్పాలని ఆమె కోరారు.


Tags:    

Similar News