గణేశ్ నిమజ్జన శోభాయాత్రకు అమిత్ షా
హైదరాబాద్ లో గణేశ్ శోభాయాత్ర ఈ నెల 6వ తేదీన జరగనుంది. కేంద్ర హోం మంత్రి అమిత్ షా హాజరుకానున్నారు
గణేశ్ శోభాయాత్ర ఈ నెల 6వ తేదీన జరగనుంది. ఖైరతాబాద్ గణేశుడితో పాటు నగరం నలుమూలల నుంచి వేల సంఖ్యలో వినాయక విగ్రహాలు ఆరో తేదీన నిమజ్జనం కానున్నాయి. ఇప్పటికే హైదరాబాద్ గణేశ్ ఉత్సవ సమితి సెప్టంబరు 6వ తేదీన గణేశ్ నిమజ్జనం నిర్వహించాలని నిర్ణయించింది. గణేశ్ నవరాత్రులు శనివారం నాటికి పదకొండో రోజుకు చేరుకోవడంతో ఆరోజు నిమజ్జనం చేయనున్నారు.
పటిష్టమైన బందోబస్తు...
అయితే కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఈ నెల 6న హైదరాబాద్ పర్యటించనున్నారు. భాగ్యనగర్ గణేశ్ ఉత్సవ సమితి ఆహ్వానంతో, ఆయన వినాయక నిమజ్జన శోభాయాత్రలో ముఖ్య అతిథిగా పాల్గొననున్నారు. శనివారం ఉదయం 11 గంటలకు బేగంపేటకు అమిత్ షా చేరుకుని, మధ్యాహ్నం చార్మినార్ వద్ద శోభాయాత్రలో హాజరవుతారు. ఈ నేపథ్యంలో నగరవ్యాప్తంగా పోలీసులు కఠినమైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు.