ఫిష్ వెంకట్ ను ఆదుకోవాలని కోరుతున్న కుటుంబ సభ్యులు
టాలీవుడ్ నటుడు ఫిష్ వెంకట్ ఆరోగ్యం క్షీణీస్తోంది.
టాలీవుడ్ నటుడు ఫిష్ వెంకట్ ఆరోగ్యం క్షీణీస్తోంది. కిడ్నీ సంబంధిత సమస్యలతో బాధపడుతున్న వెంకట్ గతంలో డయాలసిస్ చేయించుకున్నారు. దీంతో ఆరోగ్యం కొంత మెరుగుపడింది. గత కొద్దిరోజులుగా ఆయన ఆరోగ్యం మరింత క్షీణించింది. ప్రస్తుతం హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.
తన తండ్రి ఆరోగ్యం రోజురోజుకూ క్షీణిస్తోందని, తమను ఆదుకోవాలంటూ ఫిష్ వెంకట్ కుటుంబ సభ్యులు కోరుతున్నారు. నాలుగేళ్లుగా రెండు కిడ్నీలూ చెడిపోవడంతో డయాలసిస్ ద్వారా చికిత్స పొందుతున్నారు వెంకట్. ప్రస్తుతం బోడుప్పల్‌లోని ఆర్బీఎం ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. రెండు కిడ్నీలు మార్పిడి చేయాలని, ఆరోగ్యం క్షీణిస్తోందని వైద్యులు చెప్పినట్లు ఫిష్ వెంకట్ కుటుంబ సభ్యులు తెలిపారు. దాతలు ఎవరైనా సాయం చేయాలని కోరుతున్నారు.