Breaking : హైదరాబాద్ లో ఈడీ సోదాలు
హైదరాబాద్ లో ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు.
హైదరాబాద్ లో ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. సికింద్రాబాద్, బోయినపల్లి, జూబ్లీహిల్స్ లో ఈడీ అధికారులు సోదాలు జరుపుతున్నారు. సురానా గ్రూప్ ఆఫ్ కంపెనీ యాజమాన్యంతో పాటు డైరెక్టరర్ల ఇళ్లలోనూ, కార్యాలయాల్లోనూ ఈడీ అధికారుల తనిఖీలు జరుపుతున్నారు. ఉదయం నుంచి ఈ సోదాలు నిర్వహిస్తున్నారు.
సురానా గ్రూప్ ఆఫ్ కంపెనీస్...
పెద్దయెత్తున ఆర్థిక లావాదేవీలు జరపడంతో పాటు మనీ లాండరింగ్ జరిగినట్లు ఆరోపణలు రావడంతో ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ అధికారులు ఈ తినిఖీలు నిర్వహిస్తున్నారు. పెద్దయెత్తున ఆరోపణలు వెల్లువెత్తడంతో ఈరోజు తెల్లవారు జాము నుంచి ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ అధికారులు ఈ సోదాలు జరుపుతున్నారు. మొత్తం నాలుగు చోట్ల ఈ సోదాలు జరుపుతున్నారని తెలిసింది.